యాదగిరిగుట్ట : యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సాయంత్రం కుటుంబసమేతంగా సందర్శించారు. ప్రధానాలయంలోని మూలవరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ హోదాలో తొలిసారి ఆలయానికి వచ్చిన రాధాకృష్ణన్‌కు పూజారులు సంప్రదాయ స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జిల్లా కలెక్టర్ హన్మంత్ కె.జెండగే, ఆలయ ఈవో భాస్కర్‌రావులు పాల్గొన్నారు. దైవదర్శనం అనంతరం గవర్నర్‌కు పూజారులు వేదాశీర్వచనం చేశారు. స్వామి ప్రసాదాలను సీఎస్ శాంతికుమారి అందజేశారు. ఆలయ ఈవో, ధర్మకర్తలు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. భాషలు, సంస్కృతులు వేరయినా భారతీయులందరినీ ఒక్కటిగా చేసే శక్తి ఆధ్యాత్మికతకే ఉందని గవర్నర్ అన్నారు. శిల్పకళా సౌందర్యంతో ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుందని వ్యాఖ్యానించారు.
యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
SAKSHITHA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
SAKSHITHA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…