వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్ ఫ్యాక్టరీ..!
75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే..
ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు?! అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు..ప్రతి ఇంట్లో ఒక IAS, IPS ఉంటారు.. కాబట్టి దీనిని IAS ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అందుకే ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామం ఇప్పటివరకు దాదాపు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నఈ మాధోపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్, ఐపీఎస్ లను అందించింది. అందుకే ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం. ఇంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసిన ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు?! అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు..ప్రతి ఇంట్లో ఒక IAS, IPS ఉంటారు.. కాబట్టి దీనిని IAS ఫ్యాక్టరీ అని పిలుస్తారు. దీంతో భారతదేశంలో సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచింది.
ఈ గ్రామం ‘IAS ఫ్యాక్టరీ’గా పేరు పొందింది. ప్రతియేటా ఉన్నత అధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జౌన్‌పూర్ జిల్లాలోని ఈ గ్రామానికి కోచింగ్ సెంటర్‌లు లేవు. కాబట్టి, ఈ ఘనత మరింత మెచ్చుకోదగినది..! ఇక స్థానిక పండుగల సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు , నీలం లైట్ల వచ్చే కార్లతో రద్దీగా మారుతుంటాయి