సాక్షిత : 2023 సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో అవగాహన పత్రాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకు కోర్చి హైదరాబాద్ మహానగరానికి నీటిని తీసుకొస్తున్నామని… రోజుకు 520 మిలియన్ గ్యలన్లు మంచినీటిని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణ ,గోదావరి నదుల నుండి ఇంకా సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నుండి పెద్దపెద్ద పైప్ లైన్ ద్వారా హైదరాబాద్ జలమండలి నీటిని సరఫరా చేస్తుందని అన్నారు.. నీటి నాణ్యత ప్రమాణాలు పాటించడంలో నాణ్యత యాప్ ను కూడా జలమండలి సిద్ధం చేసిందని ఈ విధంగా ఎన్నో వ్యయ ప్రయాసలతో తెస్తున్న ఈ విలువైన నీటిని ప్రజల వృధా చేయకుండా వాడుకోవాలని…
ఒక అంచనా ప్రకారం నగరంలో రోజుకు 20 మిలియన్ గ్యలన్ల మంచినీరును ప్రజలు వృధా చేస్తున్నారని తెలియజేశారు.. నల్లాల ద్వారా వచ్చే నీటిని తాగే అవసరాలకు కాకుండా ఎక్కువ ప్రెషర్ ఉన్న పైపులతో కార్లు ఇతర వాహనాలు కడగటం.. భవనాల్లో క్యూరింగ్ చేయడం.. పైపు నీళ్లతో ఇంటి ఆవరణలు కడగటం వలన లక్షలాది మందికి అవసరమైన మంచినీరు వృధా అవుతుందని ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి నీటిని వృధా చేయకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు… కొద్దికొద్దిగా పొదుపు చేసిన నీరు రేపటి తరానికి ఉపయోగపడుతుందని ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలని.. నీటి వృదా తగ్గించే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిఎం ప్రభాకర్.. డీజీఎం వెంకటేశ్వర్లు, రవి ,షంషీద్, పాల్గొన్నారు…