World Death Day in Chintakani
చింతకాని లో ప్రపంచ మృత్తిక దినోత్సవం
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం సందర్భంగా చింతకాని రైతువేదికలో నెలల పరిరక్షణ పై రైతులకు అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది
.ఈ కార్యక్రమమును ఉద్దేశించి చింతకాని మండల ఎంపీపీ కోపూరి పూర్ణయ్యా మాట్లాడుతూ పంటలు పండిచుటకు, బిల్డింగ్ కట్టుటకు ప్రతిపనికి ఆధారం భూమే కనుక ప్రతి పౌరుడు భూ పరిరక్షణలో పాలుపంచుకోవాలని కోరారు,రైతుబందు సమితి మండల కన్వీనర్ కిలారు మనోహర్ బాబు ఈ సందర్భముగా మాట్లాడుతూ బంగారం కన్న కూడా భూమి విలువైనది ఎందుకంటే బంగారం కరిగిపోయే గుణం కలిగి ఉంది కానీ భూమికి మొక్కలను పంటలను పెంచే గుణం కలిగి ఉండి మానవాళికి కావలసిన ఆహార పదార్థాలను మనకి ఇస్తున్నది నేలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చింతకాని సర్పంచి బండి సుభద్ర రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మంకెన రమేష్ మండల సభ్యులు సామినేని అప్పారావు చింతకాని రైతుబందు గ్రామ కన్వీనర్ ఆకుల చంద్రయ్య మరియు మండల వ్యవసాయ అధికారి పల్లెల నాగయ్య ఏ ఈ ఓ బంధం రజిత చింతకాని నరసింహాపురం పాతర్లపాడు గ్రామ రైతులు మహిళ రైతులు పాల్గొన్నారు.