SAKSHITHA NEWS

కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల నిరసన
*
సాక్షిత వనపర్తి : * కేంద్రం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని వనపర్తి బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నలబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ డబ్ల్యూ ఎఫ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న 29 చట్టాలను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక వ్యతిరేకచట్టాలను తీసుకురావడం జరిగిందని

ఈ చట్టాల తో దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు కనీస రక్షణ కరవై తమ హక్కులు కోల్పోతారని యాజమాన్యాల దయాదక్షిణాలపై ఆధారపడి పరిస్థితి ఏర్పడుతుందని పిఎఫ్ గ్రాడ్యుటి మెడికల్ వారాంతపు సెలవులు వేతన సవరణ లాంటి హక్కులను కోల్పోతారని ఈ నల్ల చట్టాలు అమలు అవుతే కార్మికులకు బానిసత్వమే శాశ్వతమయ్యే పరిస్థితులు ఉంటాయని వారి ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీలో సంఘాలు లేక కార్మికుల పరిస్థితి ఇప్పటికే అధ్వానంగా తయారైందని గుర్తు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దుకై దేశవ్యాప్త కార్మికో ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎస్ యూనియన్ డిపో అధ్యక్షులు జేవి స్వామి ప్రచార కార్యదర్శి నాగేశ్వర్ సహాయ కార్యదర్శి గోవర్ధన్ నరసింహ జానకి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS