SAKSHITHA NEWS

మహిళలు సాధికారత సాధించాలి – ఎస్ బిఐ సిజీఎం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

మహిళలు అన్ని రంగాల్లో సాధికారత దిశగా పయనించాలని ఎస్ బిఐ హైదరాబాద్ సర్కిల్ సిజిఎం అమిత్ జింగ్రాన్ అన్నారు.
చిట్యాల పట్టణంలోనీ రైతు వేదిక వద్ద నల్లగొండ ఎస్‌బిఐ ఆధ్వర్యంలో సంధ్యా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సీజీఎం అమిత్ జింగ్రాన్ విచ్చేసి మాట్లాడుతూ
మహిళలు సాధికారత దిశగా అడుగులు వేయాలని అన్నారు. సకాలంలో కెసిసి రుణాలను పునరుద్ధరించాలని మహిళా సంఘాలను ప్రోత్సహించాలని ముఖ్యంగా మహిళా సంఘాల ద్వారా వారి అభ్యున్నతికి పాటుపడుతూ స్వయం శక్తిగా ఎదగాలని అన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సర్కిల్ జిఎం ఎన్ డబ్ల్యు 2 దేబాసిష్ మిత్ర, డీజీఎం నల్గొండ ఏవో ప్రశాంత్ బరియార్, డిడిఎం నాబార్డ్ వినయ్ కుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్,హుస్సేన్ బాబు,ఏడీ వ్యవసాయ శాఖ సీజీఎం చిట్యాల ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ సత్తయ్య ఉరుమడ్ల బ్రాంచ్ మేనేజర్ వంశీ బ్యాంకు సిబ్బంది ఏపీఎంలు ఐకెపి సీసీలు ఐకెపి వివోఏ లు బ్యాంకు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS