విద్యతోనే మహిళా సాధికారత
ఆడ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి
అనుపమ అంజలి ఐ.ఏ.ఎస్*
సాక్షిత తిరుపతి : విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి ఐ. ఏ.ఎస్. అన్నారు.
ప్రపంచ మాహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ అనుపమ మాట్లాడుతూ
మహిళలు తమ బాధలు, సమస్యలను చర్చించుకోవడానికి, నలుగురితో పంచుకోవడానికి ఒక రోజు ఉండాలనే ఉద్దేశ్యంతో మహిళా దినోత్సవం ప్రకటించారని, తొలిసారి అమెరికాలోని చికాగోలో మహిళా దినోత్సవానికి 1908లోనే బీజాలు పడ్డాయన్నారు. పలు దేశాల్లో మహిళలు మహిళా దినోత్సవాలను నిర్వహించుకున్నారన్నారు. అయితే చివరిగా మార్చి 8వ తేదీని మాహిళా దినోత్సవంగా నిర్ణయించడం జరిగిందన్నారు.
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు నడిస్తే సాధించలేనిది ఏది లేదన్నారు. పూర్వం ఒక మహిళ చదుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తుండడం సంతోషకరమన్నారు. చిన్నతనం నుండే ఒక గోల్ ఏర్పరుచుకుని సాధించేందుకు కృషి చేయాలని, మహిళలు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణాలు కలిగి ఉండాలని అప్పుడే తాము అనుకున్నది సాధించగలని చెబుతూ మరోసారి మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసారు.