SAKSHITHA NEWS

మన బస్తీ మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిస్థాయిలో మారిపోతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమీర్ పేట లోని DK రోడ్డులో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి అల్పాహారం వడ్డించి ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని హోంమంత్రి మహమూద్ అలీ శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మన బస్తీ మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన జరిగే విధంగా 7200 కోట్ల రూపాయల వ్యయంతో దశల వారిగా అన్ని పాఠశాలల ను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యార్ధులకు సన్నబియ్యం తో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న విషయాన్ని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్ధులకు పౌష్టికాహారం అందించాలనే ముఖ్యమంత్రి సంకల్పం మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్ధులకు ఈ కార్యక్రమం క్రింద అల్పాహారం అందించబడుతుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 868 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,46,086 లక్షల మంది విద్యార్ధులకు ఈ అల్పాహారం అందించాబడుతుందని తెలిపారు. వారం రోజులపాటు రోజుకొక రకం పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాల సిబ్బంది కూడా విద్యార్ధులకు వడ్డించే అల్పాహాం నాణ్యతగా ఉండే విధంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వెంకటేష్, విద్యాశాఖ కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, తహసిల్దార్ దేవయ్య గౌడ్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 10 06 at 5.36.22 PM

SAKSHITHA NEWS