కుత్బుల్లాపూర్ లో బిఆర్ఎస్ గెలుపు పక్కా…. మెజార్టీ మాత్రమే తేలాలి….: సుభాష్ నగర్ డివిజన్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కే. పీ.వివేకానంద …*
సూరారం లోని బీమా గార్డెన్స్ లో 130- సుభాష్ నగర్ డివిజన్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఎన్నికల ఇంచార్జ్ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్నపుడు నాడు పవర్ హాలిడేలు, మంచినీటి కష్టాలు నేడు లేవన్నారు. రాష్ట్రంలోని ఆడపడుచుల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు, ఆసుపత్రిలో చేరి అప్పుల పాలైన నిరుపేదలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, చేసిన సంక్షేమాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ఒక్క నెల రోజులు ప్రజలందరినీ కలుస్తూ పనిచేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మనమంతా ప్రజల కోసం పనిచేయవచ్చన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని సీఎం కేసీఆర్ కి కానుకగా ఇవ్వాలన్నారు.
అనంతరం బిఆర్ఎస్ నాయకులు ఎం. ఎస్. వాసు ఆధ్వర్యంలో 100 మంది యువకులు, మహిళలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంఛార్జి శంబిపూర్ రాజు, ఎమ్మెల్సీ కెపి వివేకానంద కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : 130 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కళ్యాణి శ్రీనివాస్, 130 డివిజన్ ఎస్సీ మోర్చా కార్యదర్శి డీ.రవి , సత్యవతి, అడబాల తనుజాలత, నెల్లూరి యామిని, మౌనిక, నీల వారి బృందం తదితరులు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.