Will work to solve the problems.. Independent corporators who met the MLA
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. ఎమ్మెల్యేను కలిసిన ఇండిపెండెంట్ కార్పొరేటర్లు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కు చెందిన ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రగతి నగర్ అంబీర్ చెరువులో గుర్రపు డెక్క తొలగించేలా చర్యలు, చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని, చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యను అధిగమించేందుకు బ్రిడ్జి వెడల్పు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా పనులు వేగంగా పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ ఆర్.శ్రీరాములు, 3వ డివిజన్ కార్పొరేటర్ బి.వెంకటరామయ్య, 6వ డివిజన్ కార్పొరేటర్ మార్త వాణి ప్రసాద్, 22వ డివిజన్ కార్పొరేటర్ పైడి.మాధవి, 24వ డివిజన్ కార్పొరేటర్ ఎం.సుజాత పాల్గొన్నారు.