SAKSHITHA NEWS

మీ ఇంటి బిడ్డగా పని చేస్తా

నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా

30వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ………………
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి_

సాక్షిత వనపర్తి

తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వనపర్తి నియోజకవర్గ ప్రజల ఇంటిబిడ్డగా పనిచేస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో BRS ప్రభుత్వం అధికారం చేపట్టిన నాడు కేవలం 67 వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉండిందని, 10 సంవత్సరాల BRS పాలన తర్వాత 7 లక్షల 20 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీయించారని ఎమ్మెల్యే అన్నారు

నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ కు రాకుండానే పాలన కొనసాగించేవాడని, నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ ఎల్లవేళలా సెక్రెటరీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు

రాష్ట్ర ఆదాయంలో అట్టి అప్పుకు వడ్డీ కడుతూనే రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని ఆయన అన్నారు

10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో వనపర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెరువులు కట్టలు అంటూ దోచుకున్నారే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు

కోట్ల రూపాయలు ఖర్చు చేసి వనపర్తి పట్టణంలో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్లు నిరుపేదలకు ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు

అదే ప్రజాధనాన్ని పట్టణంలోని అభివృద్ధి పనులకు ఖర్చు చేసి ఉంటే పట్టణం నేడు కళకళలాడుతూ ఉండేదని ఆయన అన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, నిరుపేదలకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు,
రాయితీ వంట గ్యాస్ సిలిండర్లు, రుణమాఫీ రైతు భరోసా ఇలాంటి పథకాలను అమలు చేసి నిరుపేదలకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు

ఇందిరమ్మ కాలం నుంచి నిరుపేదలకు ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసునని ప్రాజెక్టులు కట్టడం ఇల్లు కట్టించడం తో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందంజలోనే ఉంటుందని ఎమ్మెల్యే సూచించారు

BRS పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డును ఇవ్వబోతుందని దాంతో అన్ని రకాల ప్రభుత్వ సేవా పథకాలను మనం పొందవచ్చునని ఆయన అన్నారు

10 సంవత్సరాలుగా నిరుద్యోగులను BRS పార్టీ గాలికి వదిలేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 52,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని ప్రైవేట్ పరంగా సైతం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలను స్థాపించి నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ కల్పన కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు

ఇప్పటికే వేల సంఖ్యలో టీచర్ల భర్తీ చేపట్టామని త్వరలోనే మరో డీఎస్సీ ప్రకటించి టీచర్లను భర్తీ చేయబోతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు

మహిళల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఈ క్రమంలోనే మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఆర్టీసీ బస్సులు కొనుగోలు, పాఠశాల విద్యార్థులకు డ్రెస్సులు తయారీ లాంటి కార్యక్రమాలను చేపట్టి మహిళలను కోటీశ్వరులు చేయబోతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే తెలిపారు

పింఛన్లు అందిస్తున్నామని చెప్పి పదేళ్లుగా పెండింగ్లో పెట్టిన అర్హతలు ఉన్న లబ్ధిదారులు అందరికీ అది త్వరలోనే పింఛన్ పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు

గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి ఇళ్లల్లో ఉన్న అన్నదమ్ముల మధ్య భూ తగాదాల చిచ్చు రగిలించిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పేరుతో భూ సంబంధిత సమస్యలన్నిటిని పరిష్కరిస్తుందని ఆయన వివరించారు

నాలుగు సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ కౌన్సిలర్ జెడ్ పి టి సి లు అందరూ కాంగ్రెస్ పార్టీ వారే ఉండాలని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు

ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందే తప్ప ముందుకెళ్లదని దయచేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా పాటుపడాలని ఆయన సూచించారు

ఈనెల 30వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని ఇట్టి మీటింగును విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు

అమృత్ స్కీం ద్వారా వనపర్తి నియోజకవర్గంలో 73 కోట్ల రూపాయలతో తాగునీటి అదనపు నిర్మాణాలను చేపడుతున్నామని దాంతో భవిష్యత్తు 25 సంవత్సరాల వరకు తాగునీటి సమస్య రాకుండా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 379 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 37943964 కోట్ల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు

అదేవిధంగా 229 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు 44,91500 లక్షల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు

కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్, పాకనాటి కృష్ణయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు సింగిల్ డైరెక్టర్లు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS