Will there be a bus stand in Urukonda Peta? Will it blow?
ఊరుకొండ పేట బస్టాండ్ కబ్జాకు గురవుతుందాబస్టాండ్ ఉంటుందా? ఊడుతుందా
సాక్షిత ప్రతినిధి. ప్రయాణికులు ఆగడానికి కేటాయించిన స్థలనికి రక్షణ ఎవరు? *ఎంతోమంది గొప్ప నాయకులు ఉన్న ఊరుకొండ మండలంలో బస్టాండ్ ను పట్టించుకున్న నాథుడే లేడా?
నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట గ్రామం లో బస్టాండ్ ఉన్న కానీ నిరుపయోగంగాఉంది.ఊరుకొండ పేటలో బస్టాండ్ కు కేటాయించిన స్థలం కబ్జాకు గురవుతుందా * ఊరుకొండ పేట ప్రయాణికులు నిలబడడానికి ఏర్పాటుచేసిన స్థలం కొందరి కనుసైగల్లో కబ్జా కు గురవుతుందా? లేక కావాలనే కబ్జా చేశారా? ఊరుకొండ పేట గ్రామం లో గతంలోప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎంపీటీసీ కీర్తిశేషులు టి. చంద్రమౌళి వాళ్ల మామ మాజీ సర్పంచ్ పెంటయ్య స్మారకంగా సొంత డబ్బులతో ఇట్టి బస్టాండ్ నిర్మించడం జరిగింది
ఈ బస్టాండ్ చాలా అద్భుతంగా నిర్మించారు. బస్టాండ్ లోపలికి వెళితే జాతీయ నాయకుల బొమ్మలు స్వతంత్ర సమరయోధుల బొమ్మలు భారతదేశ చిత్రపటం తెలంగాణ చిత్ర పటం ఇలాంటి బొమ్మలు వేయించి చాలా చూడముచ్చటగా నిర్మించడం జరిగింది.ఇట్టి బస్టాండు ఇప్పుడు అక్రమానికి గురవుతుందని అధికారులు.రాజకీయ నాయకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు ఆ *బస్టాండ్ లోపలికి వెళ్తే కట్టెలు ఇంటి సామాను చెత్తాచెదారాలు తో నిండి ఉంది ఈ బస్టాండ్ ఎవరు కబ్జా చేయాలనుకుంటున్నారు
గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు ఇతర అధికారులు ఏం చేస్తున్నట్టు ఆదర్శ గ్రామపంచాయతి గా ఉన్న ఊరుకొండ పేట లో బస్టాండ్ పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రయాణికులు ఎక్కడ నిలబడాలో అర్థం కాక చెట్ల కింద వేరే వాళ్ళ ఇంటి ముందల నిలబడుతున్నారు. బస్టాండ్ఉండికూడానిరుపయోగంగా ఉంది ఇప్పటికైనా అధికారులు ఊరుకొండ పేట అధికారులు. ప్రజా ప్రతినిధులు గొప్పలు చెప్పుకునే నాయకులు సిగ్గు తెచ్చుకొని ఉరుకొండ పేట బస్టాండ్ ఊరుకొండ పేట గ్రామస్తుల కోసం కబ్జాకు గురైతే అట్టి వారిపై చర్యలు తీసుకొని ఊరుకొండ పేట బస్టాండ్ ను శుభ్రం చేయించి గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని ఉర్కొండ పేట గ్రామస్తులు కోరుతున్నారు.