Widespread attacks on illegal land, illegal liquor.
అక్రమ నాటుసారా, అక్రమ మద్యం పై విస్తృత దాడులు …
సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి
అక్రమంగా నాటుసారా తయారీ , నిల్వ , అక్రమ మద్యం, అక్రమ రవాణా, అమ్మకాలపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ ఆదేశాల మేరకు గత జనవరి. నెల రోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం, సెబ్ అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృతంగా దాడులు చేశారని సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఒక ప్రకటనలో వివరాలను విడుదల చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు జిల్లా పోలీసులు సమిష్టిగా జనవరి నెలలో నాటుసారా స్థావరాల పై విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు . నాటుసారా పై విస్తృతంగా దాడులు.నాటుసారా పై 38 కేసులు, 61 మంది అరెస్టు , 843 లీటర్ల నాటుసారా సీజ్ , 510 లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం, 450 కేజిల బెల్లం సీజ్, ఇద్దరు బెల్లం వ్యాపారులు అరెస్టు, 5 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అక్రమ(తెలంగాణ, కర్ణాటక) మద్యం రవాణా పై దాడులు. అక్రమ మద్యం పై 122 కేసులు, 148 మంది అరెస్టు , 3,110 లీటర్ల మద్యం సీజ్, 30 వాహానాలు సీజ్. నాటు సారా పై 12 మందిని బైండోవర్ చేయడం జరిగింది.
అక్రమ మద్యం పై 14 మందిని బైండోవర్ చేయడం జరిగింది. బ్రీచ్ అఫ్ బాండ్ షరతులను ఉల్లంఘించిన ముగ్గురి పై బాండ్లు జప్తు చేసి రూ. 26 వేలు జరిమానా విధించడం జరిగింది. నాటుసారా పై విస్తృతంగా గ్రామాలలో ఆర్ ఎస్సై , 12 మంది స్పెషల్ పార్టీ పోలీసులచే దాడులు చేస్తున్నామన్నారు.
ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ , అక్రమంగా మద్యం రవాణా, విక్రయాలకు పలుమార్లు పాల్పడే వ్యక్తులపై పిడి యాక్టులు కూడా నమోదు చేయడం జరుగుతుందని సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఐపియస్ ఈ సంధర్బంగా తెలిపారు.