SAKSHITHA NEWS

రాజావారి ఆతిథ్యాన్ని స్వీకరించిన………. రాచాల

*సాక్షిత వనపర్తి :

వనపర్తి రాజా కృష్ణదేవరాయ లువారు ప్రతి సంవత్సరం దసరా పండక్కి ఎక్కడ ఉన్న వారం రోజులు ముందుగా ఇక్కడికి చేరుకొని రాజావారి ప్యాలెస్ లో దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పండగ రోజున ప్యాలెస్ నుండి ఊరు చివరన ఉన్న జమ్మి చెట్టు వరకు ఉత్సవ విగ్రహాన్ని రాజావారి వంశస్తులై స్వయంగా స్వామివారి పల్లకి ఊరేగింపు లో పాల్గొని జమ్మి చెట్టు దగ్గర జమ్మాకును తీసుకొనిప్రజలతో పాటు అలాయి భళాయి తో దసరా పండగ ముగిస్తుంది

ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన రాజా కృష్ణదేవరాయ, యువ రాజా వారు ఆరుద్ర దేవరావులు విచ్చేశారన్న విషయం తెలుసుకున్నబీసీ పొలిటికల్ జేఏసీచైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా వారినికలిసి వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు రాచాల వెంట కావాలి రాములు సంపత్ కుమార్ రెడ్డి గౌతమ్ శంకర్ గౌడ్ మ్యాదరి రాజు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS