SAKSHITHA NEWS

టీడీపీ చూపు బడుగుల వైపా.. శ్రీకృష్ణదేవరాయలు వైపా..?

బీసీ అభ్యర్థిని బరిలో దింపే యోచనలో వైసీపీ

నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారు

షేక్. మగ్బుల్ జానీ భాషా
మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి
పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపాలన్న విషయం తేల్చుకోలేకపోతుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ఓసి అభ్యర్థులను ప్రకటించే నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో ఈసారి బడుగులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరును నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపుగా వైసీపీ ఖరారు చేసినట్లు సమాచారం.

టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి వైసీపీ తరహాలోనే బీసీలకు అవకాశం ఇస్తుందా లేక వైసీపీకి రాజీనామా చేసి త్వరలో టీడీపీ లో చేరుతారు అన్నా ప్రచారం జరుగుతున్న లావు. శ్రీకృష్ణదేవరాయలుకు నరసరావుపేట బరిలో దింపుతారా అనే సందేహం పల్నాడు ప్రజలలో నెలకొని ఉంది. పార్లమెంట్ పరిధిలో బీసీ ల ఓట్లు సుమారు 7.50 లక్షల ఓట్లు ఉండటం అందులో యాదవ సామజిక వర్గానికి చెందిన ఓట్లు పార్లమెంట్ పరిధిలో 1.25 లక్షలు ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు మంత్రాన్ని ప్రదర్శించి దిటైనా బీసీ అభ్యర్థిని బరిలో దింపేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు అయినా యాదవ సామజిక వర్గానికి చెందిన అనిల్ పేరును నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే వైసీపీ దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గలు ఉండగా ఏడు నియోజకవర్గలలో ఓసి అభ్యర్దులే ఎమ్మెల్యేలుగా ఉండటంతో నరసరావుపేట ఎంపీ స్థానం ఈసారి వైసీపీ బడుగు వర్గాలకు కేటాయించింది. అభ్యర్థుల ప్రకటనలో దాదాపుగా వైసీపీ ముందువరుసలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో మల్లగుల్లలు పడుతున్నట్లు తెలుస్తుంది. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో వైసీపీకి రాజీనామా చేసిన లావు. శ్రీకృష్ణదేవరాయలుకు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటిస్తుందా లేక వైసీపీ తరహాలో మరో బీసీ అభ్యర్థికి టీడీపీ అవకాశం కల్పిస్తుందా అనేది పల్నాడు రాజకీయలలో ఉత్కంతగా మారింది.

Whatsapp Image 2024 01 30 At 3.10.10 Pm

SAKSHITHA NEWS