SAKSHITHA NEWS

ఆమంగల్ ప్రభుత్వ హాస్పిటల్ కు మోక్షం ఎప్పుడువైయస్సార్ పార్టీ నాయకులు అర్జున్ రెడ్డి. .ఆమనగల్ పట్టణంలోని ఉన్న 30 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేది ఎప్పుడు???*

ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఎస్ఆర్ తెలంగాణ నాయకులు అర్జున్ రెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణ కేంద్రంలో2018 ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఆమనగల్ పట్టణానికి విచ్చేసిన కేసిఆర్ ఆమనగల్ పట్టణంలో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా చేసి ప్రజలకు అందిస్తానన్న హామీ ఇప్పటికి 4 సంవత్సరాల 4 నెలల 11 రోజుల అవుతున్నా కూడా పూర్తి చేయనందున వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మీటింగ్ లు పెడుతుంటే ఇచ్చిన హామీలు నెరవేరిందేమో అని ఆమనగల్ పట్టణంలో ఉన్న ఆసుపత్రి 150 పడకల ఆసుపత్రిగా మారిందేమో అని సందర్శనకు వెళ్తే 30 పడకల ఆసుపత్రి కాస్త నాలుగు పడకలకే పరిమితం అయిందనీ ఆసుపత్రిని పరిస్థితి చూస్తుంటే చాలా దయానీయమైన పరిస్థితిలో శిథిలావస్థకు చేరి ఉందనీ ఎప్పుడు పైకప్పు ఊసి నెత్తిన పడుతదో అర్థం కాని పరిస్థితిలో ఆసుపత్రి భవనం ఉన్నదనీ అక్కడ పేషెంట్స్ ని డాక్టర్స్ ని అడుగుతే భయం భయంగా ఇందులో చికిత్స చేస్తున్నామనీ చికిత్స చేయించుకుంటున్నామను అని అక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు.

మరియు ఆసుపత్రి ఆవరణ చూస్తే పందులతో చెత్త కుప్పలాగా మారి ప్రహరీ గోడ కూడా లేకుండా అద్వానమైన పరిస్థితిలో ఆసుపత్రి ఉన్నది కావున ఇప్పటికైనాఎమ్మెల్యే దృష్టి కేంద్రీకరించి ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చాలని ప్రజల తరపున వైయస్ఆర్ తెలంగాణ పార్టీ మిమ్మల్ని అడుగుతున్నాదనీ. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని ఏ మీటింగ్ పెట్టిన చెప్తూ వస్తున్నారు కానీ ఆ కోట్లాది రూపాయలు ఎక్కడ పోతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి అయితదని భావించి టిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే మరి ఇక్కడున్న ఎమ్మెల్యే ఎందుకు దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారో అర్థం అవ్వట్లేదు ఇంకా నాలుగు నెలల ఐదు నెలల కాలంలో ఎలక్షన్లో రాబోతున్నాయి వాటిని వంక పెట్టి అభివృద్ధి పనులు ఆపేసే ఆస్కారం ఉన్నది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 30 పడకల ఆసుపత్రిని 150 పడకలుగా ఆసుపత్రిగా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము . మరియు రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడ్తల్ మండల అధ్యక్షుడు నరేష్ గౌడ్, కల్వకుర్తి నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కడ్తాల్ మండల వైస్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్, సాయి, మధు, కృష్ణ, వినోద్, రాజు, జగన్, తిరుపతి, కిరణ్, బాబు తదితరులు పాల్గొన్నారు. సదా మీ సేవలో చీమర్ల అర్జున్ రెడ్డి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్.


SAKSHITHA NEWS