wheelchair was provided to Kongala Ailamma under the auspices of Temple Foundation in Vallabhapur village
కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని వల్లభాపూర్ గ్రామంలో ఆలయఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంగల ఐలమ్మ కు వీల్ చైర్ అందించారు ,,,,,,,,,,
ఈరోజు వీణవంక మండలం వల్చపూర్ గ్రామంలో కొంగల ఐలమ్మ అనే నిరుపేద మహిళా పక్షవాతంతో బాధపడుతూ ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత ను సంప్రదించగా ఆలయఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అన్నగారి సూచన మేరకు ఈరోజు వీల్ చైర్ ను అందించడం జరిగింది
ఈ సందర్భంగా ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత మాట్లాడుతూ విద్య వైద్యం మరియు ఉపాధి మా లక్ష్యం తెలియజేశారు
వికలాంగులకు జైపూర్ ఫుట్ ను తలసేమియా చిన్నారులకోసం రక్తదాన శిబిరాలు మారుమూల ప్రాంతాల్లో ఉచిత మెగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం డిచిన ఏడు సంవత్సరాల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాము
ఈ కార్యక్రమంలో ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత జీడి వెంకటస్వామి వీరబోయిన శ్రీనివాస్ యాదవ్ గాదె వెంకటరాములు చిన్నాల మల్లయ్య కనవేన తిరుపతి వాలీంటర్ లు పాల్గొన్నారు.