SAKSHITHA NEWS

జిల్లా లో తుంగ భద్ర నది నుండి ఇసుక అక్రమ రవాణా కు ఏలాంటి ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇసుక అవసరం అయిన వారు ఆన్లైన్లో అనుమతి తిసుకొని ఇసుక రీచ్ ల ద్వారా మాత్రమే తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్, IPS తెలిపారు.

జిల్లా ఎస్పీ తుంగభద్ర నది తీర గ్రామాలు అయిన తూర్పు గార్లపాడు, తుమ్మిళ్ల, చిన్న దన్వాడ, పెద్ద దన్వాడ మరియు వేణి సొంపురం గ్రామాలలో నిల్వ ఉంచిన ఇసుక డంప్ రిచ్ లను సందర్శించి ఆన్లైన్లో లో ఇసుక అనుమతులు పోంది ఇసుక రీచ్ లనుండి ఇసుకకు తీసుకెళ్ళు వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తుంగ భద్ర నది తీర గ్రామాలలో గుర్తించిన ప్రదేశాలలో ఉన్న ఇసుక డంప్ రిచ్ ల నుండి ఆన్లైన్లో లో బుకింగ్ చేసుకున్న విధానం ప్రకారం వాహనాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది అని, అనుమతి లేని వాహనాల నుండి అక్రమంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమంగా తరలకుండ గట్టి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు, మైనింగ్ అధికారులకు సూచించారు.

ప్రజలు కూడ ఇసుక ఇసుక అవసరం అయిన వాళ్లు ఆన్లైన్ ద్వారా అనుమతి పొంది ఇసుక తీసుకెళ్లాలని సూచించారు.ఇసుక రీచ్ ల దగ్గర నిరంతరం సంబంధిత శాఖ అధికారులు కాపలా ఉండాలని, అక్రమంగా ఇసుక రవాణా జరుగకుండా పటిష్టమైన నిఘా ఉంచాలని మైనింగ్ అధికారులకు సూచించారు . నది తీర ప్రాంతంలో, ఇసుక రీచ్ లు ఉన్న ప్రాంతం లో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ సిబ్బంది తో మరింత నిఘా పెంచాలని, అలాగే అక్రమ ఇసుక రవాణా జరుగకుండా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఎస్సై లకు సూచించారు. మరియు గ్రామస్థులతో ఎస్పీ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా కు సంభందించి సమచారం వస్తే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ -100 కు కాల్ చేసి సమచారం అందించాలని సూచించారు.
ఎస్పీ మేడమ్ వెంట డి. ఎస్పీ వేంకటేశ్వర్లు, శాంతి నగర్ సి. ఐ శివ శంకర్, రాజోలి ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Whatsapp Image 2024 01 19 At 6.13.54 Pm

SAKSHITHA NEWS