SAKSHITHA NEWS

What a good company.. distributed cars to employees

ఎంత మంచి కంపెనీనో.. ఉద్యోగులకు కార్లు పంచింది.

ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న వేళ ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. గూగుల్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ బహుళజాతి సంస్థలే ఖర్చుకు వెనకాడుతున్నాయి. కానీ వీటన్నింటికీ విరుద్ధంగా.. ఓ భార‌తీయ సంస్థ త‌మ ఉద్యోగుల‌కు కార్లను పంపిణీ చేసింది.

అహ్మదాబాద్ కేంద్రంగా ప‌నిచేసే త్రిధ్య టెక్ సంస్థ యాజమాన్యం తన ఉద్యోగుల్లోని 13 మందికి ఖ‌రీదైన కార్లను అందించింది, దీనిపై ఆ సంస్థ ఎండీ ర‌మేశ్ మారంద్ మాట్లాడుతూ… త‌మ సంస్థ అయిదేళ్లుగా సాధించిన విజ‌యాల వెనుక‌.. వారి కష్టం ఉన్నట్లు తెలిపారు.

అంతే కాకుండా కష్టించేతత్వం, నిబద్ధత కలిగిన ఉద్యోగులకు ఎల్లప్పుడూ తమ సంస్థ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. బాగా ప‌నిచేసే ఉద్యోగుల‌కు భ‌విష్యత్తులోనూ మరిన్ని ప్రోత్సాహాలను అందిస్తామని పేర్కొంది. ఇటువంటి ప్రోత్సాహ‌కాలు ఇస్తే ఉద్యోగులు మ‌రింత బాగా ప‌నిచేసి, సంస్థ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తార‌ని అన్నారు. తమ‌ను కంపెనీ యాజ‌మాన్యం బాగా ప్రోత్సహిస్తోంద‌ని, త‌మ శ్రమను గుర్తిస్తోంద‌ని ఉద్యోగులు చెప్పారు.

గ‌తంలోనూ ప‌లు కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ఇటువంటి ప్రోత్సాహ‌కాలే ఇచ్చి ఉత్సాహ‌ప‌ర్చాయి. లాభార్జనే త‌ప్ప ఉద్యోగుల గురించి ప‌ట్టించుకోవు కొన్ని సంస్థ. కొన్ని కంపెనీలు మాత్రం అందుకు భిన్నంగా ఉద్యోగుల‌కు ఎన్నో ప్రయోజ‌నాలు క‌ల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాయి.


SAKSHITHA NEWS