సంక్షేమ సంఘాలు ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు వారదులుగా నిలవాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1 నూతన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాలనీలో కాలనీలో సిసి రోడ్డు పనులను పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేశారు. లో ప్రెజర్ సమస్యను పరిష్కరించాలని, మిగిలిన నాలుగు వీధుల్లో సీసీ రోడ్లను పూర్తిచేయాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ సంక్షేమ సంఘం సభ్యులు కాలనీ అభివృద్ధికై పాటుపడుతూ ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు వారధిగా ఉండాలన్నారు. నూతన సంక్షేమ సంఘానికి మా మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఇంకా ఏమైనా పనులు మిగిలిపోతే పూర్తిచేస్తామనన్నారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులుగా సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శుగా దేవేందర్ రెడ్డి, కోశాధికారిగా ప్రసాద్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి, కాలనీ సలహాదారులుగా ముత్యాలు, వెంకటేశ్వర్ రావు, శివానాగి రెడ్డి, ఖాసీం పీరా, జయసింహా రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులుగా దయాకర్, సహాయ కోశాధికారిగా అరవింద్ యాదవ్, సంయుక్త కార్యదర్శులుగా సత్యం, కృష్ణ రావు, వేణు, మోహన్, సుబ్బారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రంగసుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, రమణ రెడ్డి, సందీప్ రెడ్డి, ఠాకూర్ వినోద్ సింగ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా సుబ్బారావు, సురేందర్ రెడ్డి, సంగమేశ్వర్ రావు,శ్రీనివాస్, ప్రభంజనం రెడ్డి,నర్సింహా రెడ్డి,భాస్కర చారి, చంద్రశేఖర్ రావు, నాగరాజ్, రాజేష్ ఫ్రాన్సిస్, వినోద్, రాజు, సోషల్ మీడియా కన్వినర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.