Welfare societies are the gateways for development: MLA KP Vivekanand
సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ యేసు, వార్డు మెంబర్ ఇందిరా రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.