యర్రగొండపాలెం పట్టణంలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ వారోత్సవాలు – పట్టణంలో 1.40 కోట్లతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎరిక్షన్ బాబు
పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలో 1 కోటి 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుల పనులకు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు…
యర్రగొండపాలెం పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గ్రామ స్థాయిలో తీసుకున్న తీర్మానాలతో ఈ పనులను ప్రారంభించినట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు. రాబోయే రోజులలో నియోజకవర్గంలో మరిన్ని రోడ్లను వేసి ప్రజల సౌకర్యార్ధం రోడ్ల సమస్య లేకుండా చేస్తామని ఎరిక్షన్ బాబు తెలిపారు…
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు…