SAKSHITHA NEWS

ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా శిరస్త్రాణం ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలిపారు.తన ట్రాఫిక్ కార్యాలయం నుండి ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ మాట్లాడుతూ…హెల్మెట్ ధరించడం వల్ల మీ తలపై ప్రమాదం యొక్క ప్రభావం తగ్గుతుంది. మీరు టూవీలర్ వెహికల్‌ను నడుపుతున్నప్పుడు ప్రమాదానికి గురైతే, హెల్మెట్‌ను ధరించి ఉండకపోతే, తలకు తగిలిన గాయాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది అని తెలియజేసారు.

మీరు హెల్మెట్ ధరించకుండా ప్రమాదానికి గురైతే, అది బాహ్య మరియు అంతర్గత మెదడు భాగాల్లో గాయాలకు కారణం కావచ్చు, ఇది మీ ప్రాణాలను బలిగొనే అవకాశం ఉంది. కాబట్టి, మీ ప్రాణాలను రక్షించుకోవడానికి మీరు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి అని అయన అన్నారు. ద్వి చక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ ధరించని వారిపై భారీ జరిమానా విధిస్తామన్నారు.ముఖ్యంగా యువతకు హెల్మెట్ వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగిందన్నారు.ద్విచక్ర వాహనదారులు అతివేగంగా వెళ్లకూడదని నిదానమే ప్రధానమని అన్నారు.హెల్మెట్‌ ధరిం చడంతో పాటు వాహనాల ధ్రువీకరణ పత్రాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

Whatsapp Image 2024 01 18 At 4.41.32 Pm

SAKSHITHA NEWS