We will stand by Nai Brahmins.. MLA who participated in Sankalpa Sabha…
నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటాం.. సంకల్ప సభలో పాల్గొన్న ఎమ్మెల్యే…
కార్పొరేట్ సెలూన్ల ఏర్పాటును తీవ్రంగా ఖండిస్తూ గత 45 రోజులుగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నాయి బ్రాహ్మణ సంకల్ప దీక్షను విరమిస్తు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణుల సంకల్ప సభలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని చెప్పారు. సంఘం సభ్యులంతా సమిష్టిగా ఉంటే ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చని అన్నారు. నాయి బ్రాహ్మణుల విజ్ఞప్తి మేరకు కార్పొరేట్ సెలూన్లను ఏర్పాటు చేయకుండా త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జీవో జారీ చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో త్వరలో నాయి బ్రాహ్మణులకు కమిటీ హాల్ భవనం నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు పాల్వాయి శ్రీనివాసులు, వికాస్ నాయి, రాచమల్ల బాలకృష్ణ, ఆనంద్, దన్ రాజ్, రిజిస్ట్రేషన్ నెంబర్ 579/2021 అధ్యక్షుడు ఏ.రేణయ్య నాయి,
ప్రధాన కార్యదర్శి కే.పరమేష్ నాయి, బి.శ్రీనివాస్ నాయి, చైర్మన్ ఎస్.రవిబాబు నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.సురేష్ నాయి, క్యాషియర్ వి.మహేందర్ నాయి, మీడియా ప్రచార కార్యదర్శి బంటు ప్రవీణ్ నాయి, సలహాదారులు ఎం.బిక్షపతి నాయి, ఉపాధ్యక్షుడు ఎస్ఎంఎస్ సురేష్ నాయి, యు.హనుమంతు నాయి,
జాయింట్ సెక్రెటరీ జి.వెంకటేష్ నాయి, టీ.కుమార్ నాయి, అధ్యక్షుడు మైలారం యాదగిరి నాయి, సురేందర్ నాయి, తెలంగాణ రాష్ట్ర ప్రజా యువజన యువశక్తి నాయి, బ్రాహ్మణ సేవా సంఘం సుచిత్ర శ్రీ బాలాజీ నాయి, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు V.S.R.వెంకట్, సుచిత్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఏ.సాయి నాయి తదితరులు పాల్గొన్నారు.