SAKSHITHA NEWS

We will solve the problems of municipal workers – Commissioner Anupama Anjali

మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాము – కమిషనర్ అనుపమ అంజలి

సమ్మె పిలుపును చర్చలతో ముగింపు

సాక్షితతిరుపతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ ఈ నెల 17 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన మునిసిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులతో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ప్రత్యేక సమావేశం నిర్వహించి సమ్మె నోటీసును విరమింప చేసారు.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి కార్మీక యూనియన్ నాయకులు తులసేంధ్ర, దొరస్వామిలతో జరిపిన చర్చల్లో సానుకూలత చేకూరి జరపబోవు సమ్మెను విరమించడం జరిగింది.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్లో పని చేస్తున్న కొంతమందికి జీతాలు సక్రమంగా రాకపోవడంతో పని చేస్తున్న కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రధానంగ చర్చించడంతో, కమిషనర్ అనుపమ స్పందిస్తూ రెండు నెలల జీతాన్ని తక్షణమే విడుదల చేస్తూ, మిగిలిన జీతాలను కూడా అతి త్వరలో అందిస్తామని చెప్పడంతో కార్మిక నాయకులు అంగీకారం చెప్పడం జరిగింది.

అదేవిధంగా కార్మికులకు చేయాల్సిన భీమా, పిఎఫ్ లాంటివి పెండింగ్లో లేకుండా చేస్తామని, చెత్తసేకరణ వాహనాలు కొన్నింటికి ఎఫ్.సి చేయలేదని చెప్పడంతో వెంటనే చేస్తామని, కొన్ని డిమాండ్లను జరగనున్న కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదిస్తామని కమిషనర్ అనుపమ చెప్పడంతో అంగీకరించిన మునిసిపల్ కార్మిక యూనియన్ నాయకులు తులసేంధ్ర,

దొరస్వామిలు స్పందిస్తూ మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు అందరూ చిత్త శుద్దితో తిరుపతి నగరాభివృద్దికి కృషి చేస్తారని, తమ సమస్యలపై స్పందించిన అధికారులకు, పాలక వర్గానికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు.*


SAKSHITHA NEWS