టిట్కోలో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం… సిపిఐ
చిలకలూరిపేట పట్టణం చెరువు రోడ్డులో ఉన్నటువంటి 52 ఎకరాల టిడ్కోగృహ సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ హరిబాబుకు వినతి పత్రంని సిపిఐ నాయకులు,ప్రజలు అందచేశారు. ఈ సందర్భంగా సిపిఐ చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు మాట్లాడుతూ గత వారం రోజులుగా టిట్కో గృహాలలో ప్రజా సర్వే నిర్వహించి అక్కడ ఉన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా చిలకలూరిపేట ఎన్నార్టీ సెంటర్ నుంచి టిడ్కో ఇళ్లకు వెళ్లేదుకు రెండు రహదారులు అద్వానంగా ఉన్నాయని వాటిని కొత్త రోడ్లు నిర్మించాలని కోరారు. గృహాలలో వీధిలైట్లు, మంచినీరు, నిర్మించిన హాస్పటల్లో వైద్య సిబ్బంది, పాఠశాల, అంగన్వాడి సెంటర్, కుక్కల బెడద, పార్కును శుభ్రపరచుట తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. టిట్కో గృహాలలో రేషన్ ఇస్తున్న డీలర్లు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా కేవలం ఐదు కేజీలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.
అదేమని ప్రశ్నించిన ప్రజలకు మీరు ఏ వార్డుల నుంచి వచ్చారో ఆ వార్డుల్లో ఉన్న రేషన్ షాపులు వద్ద తీసుకోండి ఇలా అయితే మా వల్ల కాదు అని తేల్చి చెబుతున్నారని ప్రజలు తెలిపారు. టిట్కో గృహాలలో ఉంటున్న అసలైన లబ్ధిదారులకు కూడా నోటీసులు ఇవ్వటం అన్యాయని బాధితులు వాపోయారు. 50,000 ,లక్ష రూపాయల ఇంటి లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఇవే కాకుండా టిట్కో గృహ సముదాయంలో అనేక సమస్యలు తిష్ట వేసుకున్నాయని కాబట్టి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించి తక్షణమే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కరించకపోతే భవిష్యత్తులో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ నాయకులు తెలిపారు. నిరసన కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ సిపిఐ ఇన్చార్జి కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ, సిపిఐ నాయకులు నాయుడు శివకుమార్, తన్నీరు వెంకటేశ్వర్లు, బొంతా భగత్ సింగ్, తంగిరాల జీవరత్నం, బొంతా బ్యాంకు శేషయ్య, ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి బి. లలిత, ఆటో యూనియన్ నాయకులు కృష్ణ, సుబ్బాయమ్మ, సుజాత,షేక్ ఖాసిం , వెంకటేశ్వర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.