SAKSHITHA NEWS

భూమన అభినయ్ కృషి వల్లే వందేళ్ల నాటి భూ వివాదాలకు పరిష్కారం….

మా ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేసిన భూమన అభినయ్ రుణం తీర్చుకుంటాం…

ఇంటింటా ఎన్నికల ప్రచారంలో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో ముక్తకంఠంతో ప్రకటించిన శెట్టిపల్లి వాసులు…

తిరుపతి

టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి శనివారం సాయంత్రం…వైఎస్సార్ సీపీ నాయకులు బత్తిన బాబు, రామకృష్ణ, బాల మురళి ఆధ్వర్యంలో స్థానిక శెట్టిపల్లిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికీ కర పత్రాలు అందజేసి, ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. భూమన కరుణాకర రెడ్డికి ఈ సందర్భంగా శెట్టిపల్లి వాసులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ, మంగళ హారతులిస్తూ, తమ అభిమానాన్ని చాటారు. శెట్టిపల్లిలో వందేళ్లకు పైగా అపరిషృతంగా ఉన్న భూ వివాదం… తిరుపతి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ కృషి వల్లే పరిష్కారమైందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

భూమన అభినయ్ చొరవతో రెవెన్యూ యంత్రాంగం సెక్షన్ 22ఏ ను ఎత్తేయడం జరిగిందని తెలిపారు. తమ ఉజ్వల భవిష్యత్ కు భూమన అభినయ్ బాటలు వేశారని, భూమన అభినయ్ కి ఎంత చేసినా మా రుణం తీరదన్నారు. ఈ ఎన్నికల్లో భూమన అభినయ్ కి ఓట్లు వేసే అవకాశం దక్కిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, భూమన అభినయ్ కే ఓట్లు వేస్తామని భూమన సమక్షంలో ముక్తకంఠంతో ప్రకటించారు. భూమన కరుణాకర రెడ్డి వెంట ప్రచార కార్యక్రమంలో పాల్గొని, మద్ధతు పలికారు.ఈ కార్యక్రమం లో మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, కో ఆప్షన్ సభ్యుడు మట్లి వెంకట రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, బండ్ల చంద్ర శేఖర్ రాయల్, శంకర్, గుణ, రమేష్, వై చెంచయ్య, ఎం చెంచయ్య, రాంబాబు, గురవయ్య, ప్రసాద్, పీ శ్రీదేవి, పార్ధు, వై గంగయ్య, పీడీ మునిరాజా, పీ నాగరాజు, కే కల్యాణ్, అశోక్, మణ్యం మునిరెడ్డి, కేఎమ్ సత్యా, ఆరె అజయ్ కుమార్, తాళ్లూరు ప్రసాద్, వంశీకృష్ణ,
నాధముని, వెలకచర్ల గోపాల్ రెడ్డి, బొమ్మగుంట రవి, కంకణాల రమేష్ నాయుడు, మధు
పెరుగు బాబు యాదవ్,అరుణ్ కుమార్,బొగ్గుల వెంకటేష్, బత్తల అరుణ్ యాదవ్, చందు రాయల్
పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 13 at 6.01.29 PM

SAKSHITHA NEWS