SAKSHITHA NEWS

[6:59 pm, 15/07/2023] Sakshitha News: జగనన్న సురక్షతో ప్రజలు లబ్ధిపొందుతున్నారు – ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ప్రజలకు రక్షగా జగనన్న సురక్ష కార్యక్రమము – తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష
జగనన్న సురక్షను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి- కమిషనర్ హరిత ఐఏఎస్
నగర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి-ఉప మేయర్ భూమన అభినయ్
నగర పాలక
[6:59 pm, 15/07/2023] Sakshitha News: *సాక్షిత తిరుపతి : జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 3,4 పోస్టల్ కాలనీ 25,28 ప్రకాశం రోడ్డు 37వ డివిజన్ గాంధీభవన్లో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ ప్రజలకు పక్కగా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో జగనన్న సురక్ష క్యాంపులను తీసుకు వచ్చిందన్నారు. ప్రజలందరికీ వందశాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అందించడమే లక్ష్యంగా ప్రారంభించి, అర్హులైన ఏ ఒక్కరు ప్రభుత్వ సంక్షేమం, సేవలు అందలేదనే పరిస్థితి ఉండరాదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష అమలు చేస్తున్నారని తెలియజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు సంబంధించిన సర్టిఫికెట్లు, జననం, మరణం, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, కులము, ఆదాయము ఇలా 11 రకాల సర్టిఫికెట్లు అవసరం ఉన్నవారికి ఉచితంగా అందించేందుకే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఏదైనా కారణం చేత అర్హత కలిగిన వ్యక్తి పథకం నుండి తప్పించినట్లయితే, అటువంటి సమస్యలను ఈ క్యాంపు లో పరిష్కరించ బడతాయన్నారు. ప్రజలను సంతృప్తి పరిచే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సహాయపడతాయని తెలియజేశారు.

మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమము ద్వారా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మీ ఇంటి వద్దకు వచ్చిన ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలియజేశారు.

కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమమును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.11రకాల సర్టిఫికెట్స్ అందజేస్తామని తెలిపారు.

ఉప మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, అందులో భాగంగా 18 మాస్టర్ ప్లాన్లు రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు ఫ్రీలెఫ్ట్ లు జరుగుతున్నాయని, గతంలో ఎవరు చేయని విధంగా జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకి సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ మెంబర్లు ఎస్.కె.బాబు, తమ్ముడు గణేష్, నరసింహచారి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, పొన్నాల చంద్ర,గీత, నరేంద్ర, కో ఆప్షన్ సభ్యులు శ్రీదేవి, ఇమామ్ సాహెబ్, గంగమ్మ గుడి చైర్మన్ కట్ట గోపి యాదవ్, తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS