
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఓటర్ల దినోత్సవం
భూపాలపల్లి జిల్లా:
జాతీయ ఓటర్ల దినోత్సవం- 2025ను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఇవాళ శనివారం ఘనంగా నిర్వహిస్తున్నా యి. ప్రతి ఏటా జనవరి 25న భారతదేశం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
1950లో భారత ఎన్నికల సంఘం(ECI) స్థాపించిన రోజును గుర్తు చేసుకుంటూ కేంద్రం ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు, ఓటింగ్ ప్రాము ఖ్యత తెలియజేసేందుకు 2011 నుంచి ఈ దినోత్స వాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎన్, నర్సయ్య ఆదేశాల మేరకు ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ బుర్ర రాజబాబు గౌడ్, ఆధ్వర్యంలో ఓటరు అనే కార్యక్రమం పై ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ బుర్ర రాజబాబు గౌడ్, మాట్లాడుతూ..18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకోవాలని వివిధ స్థాయిలలో జరిగే ఎన్నికల్లో నిష్పక్ష పాతంగా నిజాయి తీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు.
ఓటరు చైతన్యమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయన సూచించారు. విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును ఉపయోగించు కోవాలని, చెబుతూ.. విద్యార్థిని విద్యార్థుల చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ బుర్ర రాజబాబు గౌడ్ తో పాటు. కళాశాల ఉపాధ్యాయులు రెడ్డి మల్ల యాకూబ్, బొక్క స్వామి, బరిగెల సంపత్, పోటు తిరుపతి, గుగులోతు దేవోజి, కళాశాల జూనియర్ అసిస్టెంట్, ఎండి షఫీ, లైబ్రేరియన్ రాచకట్ల విజయ, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app