SAKSHITHA NEWS

మల్కాజిగిరి
మౌలాలి డివిజన్

ఆర్థికంగా వెనుకబడ్డ పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సాగుతున్న
స్వచ్ఛంద సేవా సంస్థ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్

ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్ పర్సన్ శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ నిస్వార్ధంగా పేద ప్రజలకు సేవ చేస్తున్న మా చారిటీపై
జరుగుతున్న అసత్య ప్రచారంపై వివరణ ఇచ్చారు.
గత రెండు సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్
కొన్ని వందల కుటుంబాల్లో వెలుగును నింపింది ఉచిత వైద్య సేవ మరియు ఆర్థిక భరోసా కల్పిస్తూ పేదల మన్ననలు పొందింది.
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సాగుతున్న ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీ సంస్థ గుర్తింపు పొందిన సభ్యుల వివరాలు తెలియజేయడం జరిగింది
ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్
ప్రతిష్టకు భంగం కలిగే విధంగా
వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని గతంలో ఇలాంటి చర్యలకు పాలుపడ్డ వారిపై పోలీసు కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు

కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానమై సి ఎస్ ఆర్ ఫ్రెండ్స్ ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్తుతో ఇంకా
విస్తరిస్తాయని తెలియజేశారు


SAKSHITHA NEWS