చిట్యాల సాక్షిత ప్రతినిధి
సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పోలీసులు లాటిచార్జి చేయడాన్ని నిరసిస్తూ చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ గత 36 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు అక్రమ అరెస్టు టులు. నిర్బంధాన్ని లాటి చార్జింగ్ ఖండిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. శాంతియుతంగా తమ సమస్యల్ని కలెక్టర్ కి విన్నవించుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులంతా వచ్చిన వారి పట్ల పోలీసులు లాటి చార్జి పిడుగుదులు గుద్దటం అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో 500 మందిని నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసిన చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాస్వామ్య దేశంలో సమ్మె చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రభుత్వాలు పోలీసుల ద్వారా నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరల ప్రకారంగా కుటుంబాలను పోషించు కోవాలంటే 3900 ల రూపాయలతో ఎలా పోషిస్తారని ప్రశ్నించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం గా ఉద్యోగ కార్మికుల కుటుంబాలకు కనీసం 26 వేల రూపాయలు ఇస్తే తప్ప కుటుంబాలను పోషించు కోవడం ఇబ్బంది అని తేల్చి చెప్పారు. ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తూ పెట్టుబడిదారి ప్రయోజనాలకు వస్తున్నాయని లక్షల కోట్ల రూపాయల డబ్బులను పెట్టుబడుదారులకు మాఫీ చేస్తూ. పేద బడుగు బలహీన వర్గాల చెందిన వాళ్లను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వెంటనే సమ్మె చేస్తున్న ఉద్యోగులను చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి మంత్రులు,ఎమ్మెల్యేలు, బాధ్యత, లేనిపక్షంలో రాబోయే రోజులలో ఉద్యోగులంతా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఓట్ల ధార రాజకీయ గుణపాఠాన్ని చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఏనుగు వెంకట్ రెడ్డి పొట్ల చెరువు నాగయ్య ఎర్ర రవీందర్, కడగంచి నరసింహ, పాల లక్ష్మయ్య, బాకీ అండాలు, జ్యోతి సైదులు. జడల నరసింహ, ఏదుల్లా లక్ష్మి, గుడిసె సువర్ణ, గుడిసె పద్మ. అద్దెల ఉమా, పాకాల సత్యనారాయణ ఉయ్యాల శోభ. వడ్డె గాని విజయలక్ష్మి తదిపర్రు పాల్గొన్నారు.