SAKSHITHA NEWS

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న నగర్ కాలనీ చౌరస్తా లో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు మరియు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి జెండా ఆవిష్కరణ చేసి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు,పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ (టిఆర్ఎస్) పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా… బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని,

ఏప్రిల్ 27, 2001 నాడు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు పనిచేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతుల కోసం, శ్రామికుల కోసం, కర్షకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం.. పార్టీ పోరాటం చేస్తున్నది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

తెలంగాణ ఆత్మ ప్రతీక మన బీఆర్ఎస్ పార్టీ జెండా అని, స్వరాష్ట్రం కోసం పుట్టిన జెండా మన బీఆర్ఎస్ పార్టీ జెండా అని అన్నారు. పోరాడి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నిలిపిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ కొట్లాడి, తెగించి తెచ్చిన స్వరాష్ట్రం ఈ పది సంవత్సరాలు వారి పాలనలో స్వర్ణయుగంలా మారిందని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలబడినది అని, సంక్షేమం, అభివృద్ధి లో అగ్రపథనా విరాజిల్లినది అని , అనేక సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న గులాబీ జెండా అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

రెపరెపలాడే గులాబీ పతాకం
తెలంగాణ ఎగరేసిన జయ కేతనం,పర పీడన చెర విడిపించిన ఉద్యమ జెండా,
పసిడి కాంతులు పంచిన ఉజ్వల ప్రగతి బావుటా,పుట్టుకే ఒక సంచలనం..
దారి పొడవునా రాజీలేని రణం,ఆత్మగౌరవ మెరుపులు..అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న ..స్వీయ రాజకీయ అస్తిత్వ చైతన్యం..జలదృశ్యంలో ఉదయించి..ఉర్రూతలూగించే ఉద్యమ దృశ్యాలను ఆవిష్కరించి..
స్వరాష్ట్రం సాధించి.. సస్యశ్యామల సన్నివేశాలను సృష్టించి ..గమ్యాలను ముద్దాడినగమనంఅమేయం..అజేయం..అనితర సాధ్యం గులాబీ పరివర్తన ప్రస్థానం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

WhatsApp Image 2024 04 27 at 3.38.22 PM

SAKSHITHA NEWS