వీర బ్రహ్మేoద్ర కామాక్షి సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వ కర్మ జయంతి వేడుకలు.
సాక్షిత పరవాడ : సెప్టెంబర్ 17 వీర బ్రహ్మేoద్ర కామాక్షి సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వ కర్మ జయంతి వేడుకలు పరవాడ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ వీరబ్రహ్మేoద్ర స్వామి వారి చిత్ర పటానికి పూల మాల వేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జరుపుకునే విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమలో పెద్ద చెరువు ఆయకట్టు సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీను , అనకాపల్లి జిల్లా సాంస్కృతిక విభాగ టిడిపి అధికార ప్రతినిధి పైలా రామచంద్ర రావు, వెదురుపర్తి వెంకట సురేష్ కుమార్ దంపతులు, శ్రీ వీరబ్రహ్మేంద్ర కామాక్షి సేవా సంఘం సభ్యులు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వీర బ్రహ్మేoద్ర కామాక్షి సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వ కర్మ జయంతి వేడుకలు.
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
SAKSHITHA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
SAKSHITHA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…