పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : వైపాలెం ఎస్సై జి కోటయ్య
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 3 వ తేదీ నుంచి 18 వరకు జరుగు పదవ తరగతి పరీక్ష సెంటర్స్ అయిన గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గురుకుల పాఠశాల మరియు నలంద స్కూల్ వద్ద పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుందని యర్రగొండపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జి కోటయ్య తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుంది, ఎగ్జామ్స్ సెంటర్ల దగ్గర్లో జిరాక్స్ షాప్స్ మూసి వేయాలన్నారు.
పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఏ ఇతర సిబ్బంది గానీ వ్యక్తులు గానీ ఉండరాదు
మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు మరియు ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద ఎవరైనా కాపీలు అందించడానికి పాల్పడితే అట్టి వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామణి ఎస్సై కోటయ్య తెలిపారు.