పల్నాడు జిల్లా
అభివృద్ధి పధం లో వినుకొండ నియోజకవర్గం
వినుకొండ నియోజకవర్గంలోని గుండ్లకమ్మ నది పై పలు గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్ &బ్రిడ్జి లు నిర్ణయం కొరకు నిధులను మంజూరు చేసి పనులను వేగవంతగా చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు..
వినుకొండ నియోజకవర్గంలోని అందుగుల కొత్తపాలెం, పాతనాగిరెడ్డిపల్లె గ్రామాల మద్య గుండ్లకమ్మ నది పై నిర్మించబోయే బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు
గుండ్లకమ్మ నది పై శ్రీశైలం హైవే లోని వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామం లో నుండి నూజండ్ల మండలం లోని పాత నాగిరెడ్డిపల్లి, లింగముక్కపల్లి, మృత్యుంజయపురం గ్రామాలను అనుసంధానం చేస్తూ కురుచేడు, దర్శి మార్గం కు కలుపుతూ నిర్మించిన రోడ్డు ను పరిశీలించి అనంతరం , గుండ్లకమ్మ నది పై సుమారు 18 కోట్ల రూపాయల తో బ్రిడ్జి నిర్మాణం చేయుటకు ప్రభుత్వం తరపున ఉత్తర్వులు జారీ కాగా, త్వరలోనే టెండర్ ప్రక్రియ ద్వారా బ్రిడ్జి నిర్మాణ పనులను మెదలుపెట్టడం జరుగుతుందని తెలిపారు.
అలాగే వినుకొండ మండలం గోకనకొండ గ్రామం వద్ద కూడా గుండ్లకమ్మ నది పై *సుమారు 17 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ కూడా త్వరలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోందని తెలియజేశారు.