సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
సాక్షిత – సిద్దిపేట బ్యూరో : ప్రజల వద్దకు సిపిఐ అనే నినాదంతో సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్వర్యంలో కేశవపూర్, మల్లంపల్లి, పెద్దతండా, కట్కూరు, కన్నారం గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసన సభ్యులు చాడ వెంకటరెడ్డి సోమవారం రోజున పర్యటించారు. ఈసందర్భంగా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ,రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయి తప్ప హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.
పేద ప్రజలను మోసం చేస్తూ గృహలక్ష్మి, బిసి దళిత రైతు బంధు పథకాలు ఎంత మందికి ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని చాడ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే పనిచేస్తున్నాయని వారికే లబ్ది చేకూరేలా ఉన్నాయన్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో ఎక్కడ సంపూర్ణంగా పేద ప్రజలకు ఇల్లు ఇప్పటి వరకు ఇవ్వలేని కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ప్రాంత సమస్యలపై హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పట్టించుకోవడం లేదన్నారు.
పేద ప్రజలకు ఎల్లపుడు అండగా ఉండేది కేవలం సీపీఐ పార్టీ అని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని చాడ కోరారు. హుస్నాబాద్ నియోజకవరంలో గ్రామాలు చూస్తుంటే గత 9 ఏళ్ల క్రింద చేసిన అభివృద్దే కనబడుతుంది అని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు కనపడుతుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగిరి సత్యనారాయణ, ఎడల వనేశ్ భీమదేవరపల్లి మండల కార్యదర్శి ఆధారి శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష,కార్యదర్శులు సంగెం మధు, జేరిపోతుల జనార్దన్, సీపీఐ నాయకులు తేరాల సత్యనారాయణ, మాడిశెట్టి శ్రీధర్, బూడిద సదాశివ, మార్కరాజయ్య, బుచ్చల శ్రీనివాస్, తల్లా ప్రశాంత్, గుండాల భిక్షపతి, జాల శ్రీనివాస్, రాజు, ముక్కెర కుమార్, గొర్ల వెంకన్న, గుగులోతు వీరన్న యాదగిరి, కొమ్ముల శివ లక్ష్మీ, స్వరూప, రజిత, హమాలి సంఘ అధ్యక్ష,కార్యదర్శులు, భవన నిర్మణా కార్మికులు తదితరులు పాల్గొన్నారు