వికారాబాద్ జిల్లా ధారురు మండలం నాగారం వద్ద వాగులో కారు గల్లంతు..
చెట్టు సహాయంతో బయట పడ్డ కారులో ఉన్న కుటుంబ సభ్యులు….
వికారాబాద్: జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నయీ వరద ప్రవాహ వేగాన్ని చూసుకోకుండా కారును దాటించే ప్రయత్నం చేసిన కారు డ్రైవర్
చెట్టును పట్టుకొని గట్టెక్కరు కారులో ఉన్న ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు
దేవనూరు శివ, ఆయన భార్య మౌనిక నాగారం సమీపంలోని వాగు దాటుతుండగా నీటి ఉధృతికి కారు నీటిలో కొట్టుకుపోయింది.
కారు నీటిలో కొట్టుకుపోతుండగా వారు చాకచక్యంగా కారులో నుంచి బయటపడ్డారు.
చెట్లను ఆసరాగా చేసుకుని గట్టుకు చేరుకున్నారు.
వెంటనే కేకలు వేయడంతో అటుగా వచ్చిన వారి సహాయం కోరారు. నాగారం గ్రామానికి చెందిన కొందరు తాళ్ల సాయంతో వారిని బయటికి తీసుకొచ్చారు.
దసరాకు పండుగకు సొంత గ్రామమైన దోర్నాల గ్రామానికి భార్యాభర్తలు శివ, మౌనిక వచ్చారు.
పండుగ చేసుకొని గురువారం ఉదయం తెల్లవారుజామున తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
అయితే…… రాత్రి కురిసిన భారీబవర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.