SAKSHITHA NEWS

చంద్రబాబు పుట్టినరోజు

బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన విజయసాయిరెడ్డి

ఎన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించిన విజయసాయి

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు ,కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని విజయసాయి ట్వీట్ చేశారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాకు విజయసాయి దూరంగా ఉంటున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చేయడాన్ని దాదాపుగా ఆపేశారు.

ఈ తరుణంలో చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలపడం అందరినీ ఆకట్టుకుంటోంది.


SAKSHITHA NEWS