SAKSHITHA NEWS

Vijayabai’s resignation from primary membership of CPI

సీపీఐ ప్రాథమిక సభ్యత్వానికి విజయబాయి రాజీనామా

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సీపీఐ పార్టీ సభ్యురాలిగా, జిల్లా కౌన్సిల్ ఆహ్వానితురాలిగా కొనసాగుతున్న వైరా నియోజకవర్గానికి చెందిన బానోత్ విజయబాయి ఆ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ మేరకు సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కు రాజీనామా లేఖను అందజేశారు. ఇప్పటివరకు పార్టీలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.


SAKSHITHA NEWS