సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవం దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జోనల్ మేనేజర్ TSIIC సైబరాబాద్ వారి ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ పరిధిలోని Tech Mahindra Learning world మీటింగ్ హాల్ లో నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి , కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , దొడ్ల వెంకటేష్ గౌడ్ , డీసీ వెంకన్న , డీసీ సుధాంష్ తో కలిసి పాల్గొని ,ప్రసంగించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మేధోమధనం ,దార్శనికత మరియు మంత్రి కేటీఆర్ కృషి, పట్టుదల వలనే నేడు హైదరాబాద్ నగరం విశ్వనగరంగా దిన దిన అభివృద్ధి చెందుతుంది అని, తెలంగాణ పారిశ్రామిక రంగం అగ్రపథంలో దూసుకెళ్తుంది అని పారిశ్రామిక ప్రగతి కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ఐటి హబ్ గా శేరిలింగంపల్లి విరజిల్లుతుంది అని,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెరిగాయని అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సరళతరం వంటి విషయాలలో ప్రభుత్వం తనవంతు ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో అగ్రగామిగా అయ్యేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు
ఐటి పరిశ్రమలకు అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం అని ,ప్రయాణం కు అనుకులంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించడం జరిగినది అని, మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం జరిగిన సంగతి విదితమే నని, పనులు పురోగతి లో ఉన్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .T హబ్ వంటివి ఏర్పాటు చేసి యువత సృజనాత్మకతను వెలికి తీసి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిద్దిద్దుటలో T హబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.