సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ లో గల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి భూదానం స్కిమ్ యొక్క కరపత్రం ను ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం కోసం వెంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రక్కన గల 227 గజాల స్థలం ను భూదానం స్కిమ్ క్రింద కొనుగోలు చేయుటకు గాను కరపత్రం ను ఆవిష్కరించడం జరిగినది అని, ఇది ఒక మంచి కార్యక్రమం అని, ఆ దేవుడి కృప తో అంతా మంచే జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.భూదానం స్కిమ్ క్రింద గజం కి ఒక లక్ష రూపాయలు చొప్పున చెల్లించవల్సి ఉంటుంది అని , తమరికి తోచిన విధంగా చెల్లించవల్సిందిగా భక్తులకు తెలియచేసారు. స్వామి కార్యంలో బాగస్వామ్యులు కావాలని , ప్రభుత్వ విప్ గాంధీ ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగినది. ప్రభుత్వ విప్ గాంధీ తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 27 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ దేవాదాయశాఖ రామకృష, EO సత్యచంద్రారెడ్డి, ఆలయ ఛైర్మన్ KRK రాజు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ , శ్రీహరి, కిరణ్ ,అప్పిరెడ్డి, కుమార్ స్వామి, లక్ష్మీ మరియు మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి, పోతుల రాజేందర్, పద్మ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.