SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా

అంబటి ఇలాకాలో అక్రమ మైనింగ్ మాఫియా: గాదె వెంకటేశ్వరరావు

నకరికల్లు మండలం త్రిపురాపురంలో అక్రమ మైనింగ్ ఉదయం మాత్రం ఎవరూ కనిపించరు రాత్రి అయితే చాలు పోలీసుల అండతో వేల లారీలను అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు….

బకాసుర(మంత్రి అంబటి)రాజ్యంలో మైనింగ్ మాఫియా ప్రభుత్వం నుండి గాని మైనింగ్ వారి నుండి గాని ఎటువంటి పర్మిషన్లు లేకుండా ప్రభుత్వం మాదే మేము ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోము మా ఇష్టానుసారంగా మేము మట్టిని దోచుకుంటాము అన్న విధంగా మట్టిని దోచుకుంటున్నారు…

పెద్ద మొత్తంలో అటవీ భూమిని దోచుకుంటూ మరికొంత రైతులు దగ్గర్నుంచి భూమిని అధికార పార్టీ నాయకుల అండాదండలతో రైతులను బెదిరించి వాళ్ల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నారు….

జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం.. అసలు నువ్వు మంత్రివా.. దొంగ వా..అసలు ప్రజాప్రతినిధివా, అసలు నువ్వు మంత్రి వేనా…

ఇంత పెద్ద ఎత్తున అటవీ భూమిని, ప్రభుత్వ సంపదను దొంగల మాదిరిగా దోచుకుంటుంటే నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు… దొంగల్లో దొంగగా మారి నువ్వు కూడా ఆ సంపాదించుకున్న ఆస్తులు కూడా పెట్టుకుంటున్నావ్..

దయచేసి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గరనుంచి రాష్ట్రం మొత్తం ఈ విధంగానే ఏ నియోజకవర్గం లో ఎక్కడ ఇసుక ఉందా..? ఎక్కడ కొండలు ఉన్నాయా..? అని అన్నిచోట్ల ఇదేవిధంగా దోచుకుంటూ వెళుతుంది…

ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మైనింగ్ ని జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం…

ఇకనైనా ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ అక్రమ మైనింగ్ ఆపకపోతే అంబటి రాంబాబు ఇంటి ముందుకు వెళ్లి చీపిర్లు తీసుకొని నిరసన తెలియజేయాల్సి ఉంటుందని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు…..


SAKSHITHA NEWS