SAKSHITHA NEWS

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ వికర్ సెక్షన్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలవతో సన్మానించి,అభినదించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గారు మాట్లాడుతూ వెంకటేశ్వర నగర్ వికర్ సెక్షన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. అదేవిధంగా వెంకటేశ్వర నగర్ వికర్ సెక్షన్ కాలనీ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని , ఏ చిన్న సమస్య ఐన కార్పొరేటర్ దృష్టికి గాని, తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని,నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళాల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ ,ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మౌలిక వసతుల కల్పనకై పెద్ద పీట వేస్తానని, వెంకటేశ్వర నగర్ వికర్ సెక్షన్ కాలనీ అసోసియేషన్ భాగస్వామ్యం తో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వెంకటేశ్వర నగర్ వికర్ సెక్షన్ కాలనీ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు: కె.కొండల్ రావు
ఉపాధ్యక్షులు : కె.నాగార్జున చారి, రాజశేఖర్.
కార్యదర్శులు: వినయ్, పోతురాజు.
కోశాధికారి:బాలలింగం
మరియు మునేశ్వర్ రావు,వెంకటేశ్వర్లు,కిషన్,తనారం, గోపీనాథ్ సూరి, ప్రకాష్, వెంకటేష్ ఉషారాణి,లతీఫ్, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2024 02 08 at 3.38.05 PM

SAKSHITHA NEWS