SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ఏర్పాటు చేసిన వందశాతం రాయితీ పైన ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా మత్స్య శాఖ అధికారులు మరియు మండల నాయకులతో కలిసి గోదావరిలో చేప పిల్లలను వదిలారు.*

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..

జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో వంద శాతం రాయితీ పైన ఉచిత చేప పిల్లలను గోదావరిలో వదిలే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, గంగపుత్రులు గాని, ముదిరాజులకు గాని మేలు జరిగే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని,మత్స్య రంగానికి సంబంధించి చేప పిల్లల పెంపకానికి కొంత భూమి అవసరం ఉందని మరియు ఇతరాత్ర సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని,వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని,మత్స్య రంగం పై ఆధారపడి ఉన్నవారికి ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున గాని,అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గాని ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్న వారికి లబ్ధి చేకూరే విధంగా నావంతు సహకారం అందిస్తానని,జిల్లా మత్స్య శాఖ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు..

ఈ కార్యక్రమంలో అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS