వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఖమ్మం జిల్లా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
భారతీయ రైల్వే యొక్క అత్యంత ప్రతిష్టాత్మక రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలును 15 జనవరి సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు . ఈ నెల వ్యవధిలో రైలు వినియోగదారుల నుండి ఉత్సాహభరితమైన స్పందన పొందింది. ఈ రైలు నాలుగు మధ్యంతర స్టేషన్లు అనగా వరంగల్, ఖమ్మం, విజయవాడ మరియు రాజమండ్రి లలో ఆగుతుంది. ఈ మధ్యంతర స్టేషన్లలో కూడా ప్రయాణికుల నుండి మంచి ఆదరణ మరియు చాలా ఆశాజనకమైన స్పందన లభిస్తోంది .
తెలంగాణలో ఖమ్మం చాలా ముఖ్యమైన నగరం మరియు పగటిపూట ఈ ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మంచి ప్రయాణ సౌకర్యం లభించింది. ఖమ్మం నుంచి వరంగల్, సికింద్రాబాద్‌లకు 1,182 మంది ప్రయాణికులు ప్రయాణించగా, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు మరో 2,768 మంది ప్రయాణికులు ఏ రైలు ద్వారా ప్రయాణించారు. మరోవైపు విశాఖపట్నం వైపు నుంచి 1,274 మంది ప్రయాణికులు ఖమ్మం స్టేషన్ కు రాగా, మరో 1,806 మంది సికింద్రాబాద్ వైపు నుంచి ఖమ్మం వరకు ఈ వందే భారత్ రైలులో ప్రయాణించారు. మరో మాటలో చెప్పాలంటే, ఖమ్మం స్టేషన్ నుండి ప్రతిరోజూ సగటున 95 మంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతున్నారు , మరో 106 మంది ప్రయాణికులు ఖమ్మం స్టేషన్లో ప్రతిరోజూ ఈ రైలు ద్వారా దిగుతున్నారు .
ఈ ప్రతిష్టాత్మక రైలును ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు ప్రయాణీకుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది . ఇరువైపులా ( సికింద్రాబాద్ నుండి విశాఖ మరియు విశాఖ నుండి సికింద్రాబాద్ ) కు పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. 16 జనవరి 2023 న రైలు సర్వీసును ప్రవేశపెట్టినప్పటి నుండి రైలు రెండు దిశలలో దాదాపు 140% సగటు ఆక్యుపెన్సీ(ప్రయాణికుల కూర్చునే సీట్ల సామర్థ్యం ) తో నడుస్తోంది. ఖమ్మం నుండి రైలు ప్రయాణీకులు కూడా ఈ సెమీ-హై స్పీడ్ రైలులో ప్రయాణించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు మరియు ప్రయాణీకుల నుండి అందిన స్పందన చాలా సంతృప్తికరంగా వుంది. ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందిస్తున్న వేగం మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఖమ్మం మరియు చుట్టుపక్కల ప్రాంతాల రైలు ప్రయాణీకులకు అలాగే రెండు మార్గాలలో రైలు సేవలను ఇష్టపడే రీతుల్లో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒకటిగా నిరూపించబడింది. ఈ రైలు అన్ని విధాలుగా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్గి ఉండి రైలు ప్రయాణీకుల యొక్క ఆకాంక్షలను తీర్చగలిగింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశిష్టతలు
• ప్రయాణాన్ని మరింత సౌలభ్యముగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి ఆధునిక సౌకర్యాలతో సమకూర్చబడింది . అమర్చబడింది.
•జి పి ఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థతో (ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం ) ప్రారంభించబడింది మరియు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లను కలిగి ఉంది.
• ప్రతి కోచ్‌లో రిక్లైనర్ సీట్లు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో సీట్లు ( 180 డిగ్రీలో ) తిరిగే అదనపు సౌకర్యం
• ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ అలారం బటన్ మరియు ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లు.
• సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణం కోసం అన్ని కోచ్‌లలో సి సి టి వి కెమెరాలను అమర్చారు. అదనంగా, కోచ్‌ల వెలుపల ప్లాట్‌ఫారమ్ వైపు కూడా కెమెరాలు ఏర్పాటు చేసారు .
• అన్ని కోచ్‌ల మధ్య రాకపోకలకు సులభతరంగా ఉండేందుకు మూసివేసిన గ్యాంగ్‌వేలతో ఏర్పాటు
• అన్ని ఎలక్ట్రికల్ క్యూబికల్స్ మరియు టాయిలెట్లలో మెరుగైన అగ్ని మాపక భద్రత ప్రమాణాలు.
• టచ్ ఫ్రీ సౌకర్యాలతో ఆధునిక బయో-వాక్యూమ్ టాయిలెట్లు.
• ప్రయాణీకుల సమాచారం మరియు ఇన్ఫోటైన్‌మెంట్‌ను వ్యాప్తి చేయడానికి ప్రతి కోచ్‌లో పెద్ద సైజు (32″).డిస్ప్లే యూనిట్లు
• ప్రతి కోచ్‌లో నాలుగు అత్యవసర విండోలు అమర్చబడి ఉంటాయి.
• ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ. “కవచ్” యొక్క అధునాతన భద్రత అమర్చబడింది .
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయోజనాలు-
• వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు అనుకూలమైన పగటి పూట ప్రయాణ సౌకర్యం
• మొట్టమొదటిసారిగా ఆకర్షవంతంగా రూపొందించబడిన మరియు పూర్తిగా ఏ సి సర్వీస్
• రైలు వినియోగదారులకు మెరుగైన అనుభూతితో కూడిన ప్రయాణ సౌకర్యం.
• ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు పగటి వేళ నడుస్తుంది.
• ఇతర రవాణా మార్గాలతో ప్రయాణ సమయాన్నిపోల్చితే ఇది అతి తక్కువ ప్రయాణ సమయం.