SAKSHITHA NEWS

ఆరోపణలు నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేస్తా వలరాజు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం

తెలుగు దేశం సీనియర్ నాయకులు మన్నే రవీంద్రా తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తెలుగుదేశం పార్టీలో తనకు వున్న పదవికి రాజీనామా చేస్తా అని త్రిపురాంతకం మండల పార్టీ అధ్యక్షుడు వలరాజ్ అన్నారు.త్రిపురాంతకం మండల కేంద్రంలో త్రిపురాంతకం నాయకులు విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు.తాను గణపవరం గ్రామంలో వైసిపి తరుపున డబ్బులు పంచాను అని రవీంద్రా చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టివేశారు.తను డబ్బులు పంచినట్ట్ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తా అని అన్నారు.త్రిపురాంతకం వున్న బాలాత్రిపుర సుందరి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తానని అన్నారు.బీసీ కులానికి చెందిన తను అధ్యక్షునిగా వ్యవహరించడం తనకు ఇష్టం లేదని అన్నారు.తన సొంత బామర్డి అయిన మాజీ కణ్విన్నర్ సీతయ్యను కాదని తనకు పార్టీ బాధ్యతలు కట్టబెట్టడం వల్లనే ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవినేని చలమయ్య,ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగు దేశానికి త్రిపురాంతకం మండలం కంచుకోట అన్నారు.ఎన్నో ఏళ్లుగా త్రిపురాంతకం మండలంలో అనేక యం పి టి సి స్థానాలు గెలిచమని తమ బామర్ది సీతయ్య మండల పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు కనీసం ఒక్క ఒక స్థానం కూడా కైవసం చేసుకోలేక పోయామని గుర్తు చేశారు.ఇప్పుడు తాను వ్యతిరేకిస్తున్న నియోజకవర్గ ఇంచార్జి ఎరిక్షన్ బాబు కూడా తాను తెచ్చిన అభ్యర్దే అని గుర్తు చేశారు.తన వునికిని ఎక్కడ కోల్పోతుంది అనే భావనతో అందరినీ విబదిస్తునరని అన్నారు.ఇప్పుడు తన వెంట వున్న నాయకులు ఈమధ్య ఏమ్మెల్షి ఎన్నికల సమయంలో ఎక్కడికి వెల్లరాని ప్రశ్నించారు.పైన రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో వుండాలని వై పాలెంలో వైసిపి రావాలని కోరుకునే వ్యక్తి మన్నే రవీంద్ర అని యద్దేవా చేశారు. ఎరిక్షన్ బాబు ప్రజలలో కలిసిపోవడం ఇష్టం లేక,తన వునికి కోల్పోతుంది అని ఇలా నియోజక వర్గంలో చిచ్చు పెడుతున్నారు అని వారు అన్నారు.తాము చేసిన తప్పులు,రవీంద్రా వర్గ సభ్యులు చేసిన తప్పులు త్వరలో అధిష్టానం దృష్టికి వెళ్లి తేల్చుకుందాం అంటూ సవాలు విసిరారు.ఈకార్యక్రమంలో మాజీ మండల పార్టీ కన్విన్నర్ శ్రీనివాస రెడ్డి,సీనియర్ నాయకులు వూట్ల వెంకటేశ్వర్లు,అల్లూరు రెడ్డి,నాగరాజు,సునీల్,బలనాసర్, గుత్తా వెంకట నారాయణ, బాదుర్ల,బొరయ్య,అవులయ్యా, బసవయ్య,అంజి రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, అయప్ప,బ్రంహయ్య,రమణ రెడ్డి మరికొందరు తెలుగు దేశం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS