
తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న వడ్లమూడి
ఉదయగిరి సాక్షిత
ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం పట్ల ఆసక్తి చూపాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా వరికుంటపాడు మండలం వేంపాడు గ్రామపంచాయతీ అశోక్ నగర్ గ్రామం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వడ్లమూడి నాగేంద్ర తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. వడ్లమూడి నాగేంద్ర ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీకాకర్ల సురేష్ ప్రత్యేకంగా అభినందించారు. శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సభ్యత్వంతో ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుందని, ఇన్సూరెన్స్ తో ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
