SAKSHITHA NEWS

Utilization of available technology to facilitate arrest of criminals

నేరస్తుల కట్టడి సులభతరం చేసేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొవాలి.

-పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నేరస్తుల కట్టడి సులభతరం చేసేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొవాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..నేర పరిశోధన, దర్యాప్తు అన్ని దశలోనూ లోప రహితంగా ఉండేటట్లు చూడాలని అన్నారు.

నేరస్ధులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడం, బాధితులకు సరియైన న్యాయం జరిగేలా చేయడంలో పోలీస్ అధికారులు క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టాలన్నారు. నేర నిరుపణ, శిక్ష ఖరారు (కన్విక్షన్ రెటు) తగ్గినప్పుడు అది సమాజంలోని ప్రజల భద్రత, రక్షణపై ప్రభావితం చూపుతుందనే విషయాన్ని అధికారులు గ్రహించాలని స్పష్టం చేశారు.

నిర్ణీత కాలంలో ఎఫ్ఐఆర్ నమోదు నుండి నిందితుల అరెస్టు, దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు వరకు లోతుగా అధ్యయనం చేయడం, నేరస్థులు తప్పించుకోకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి దోషులకు శిక్షలు పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ పకడ్బంది చర్యలు తీసుకొవాలన్నారు


అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో
చట్టప్రకారం నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.సీసీ కెమెరాలు గ్రామాలలోని వివిధ సెంటర్లు, సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ నుండి ఖమ్మం కంట్రోల్ కమాండ్ కి కంట్రోల్ కు అనుసంధానం చేసేవిధంగా చర్యలు తీసుకొవాని సూచించారు. సీసీ కెమెరాలు ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.


కమిషనరేట్ అన్ని పోలీస్ స్టేషన్లలో పరిధిలో విజబుల్ పోలీసింగ్ ద్వారా విస్తృతంగా తనిఖీలు చేయాలని అన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి నెంబర్ ప్లెట్ లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఏఆర్ కుమారస్వామి, ఏసీపీలు రామోజీ రమేష్ , గణేష్, రహేమన్, రామానుజన్ , భస్వారెడ్ధి, ప్రసన్న కుమార్ , రవి, వెంకటస్వామి , వెంకటేశ్వరరావు వివిధ పోలీస్ స్టేషన్ నుండి సిఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS