గత ప్రభుత్వ హయాంలో యద్దేచ్చగా భూ దందా కొనసాగించిన కొందరు వ్యక్తులు కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా తమ దందాను కొనసాగిస్తున్నారని , వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి బుక్యా ఉపేంద్ర , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు ఆయన క్యాంప్ కార్యాలయంలో కలుసుకుని వినతి పత్రాన్ని సమర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రఘునాథ మండలంలోని ఉదయ నగర్ లో సర్వే నెంబర్ 192 లో పేదలకు కేటాయించిన సుమారు 400 ఇళ్లను అక్కడి సర్పంచ్ సర్పంచ్ భర్త ఉప సర్పంచ్ తో పాటు మరికొందరు ,
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండదండలతో అధికారులతో కుమ్మక్కై ఒక్కో ప్లాట్ ను సుమారు లక్ష రూపాయలు చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారు ఇంకా తమ భూ దందాను కొనసాగిస్తున్నారని విమర్శించారు. పేదలకు కేటాయించిన ఆ ప్లాట్ లను వెంటనే స్వాధీన పర్చుకోవడం తోపాటు సర్పంచ్ ఉప సర్పంచ్ మరి కొందరు వ్యక్తులపై క్రిమినల్ తీసుకోవాలని సూచించారు. అలాగే వీరికి సహకరించిన ప్రభుత్వ అధికారుల పాత్ర గురించి విచారణ నిర్వహించి, వారిపై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని విన్నవించారు. ఈ మొత్తం అంశాలను వినతి పత్రంలో పేర్కొన్నామని , ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు. వినతి పత్రం సమర్పించిన బృందంలో మీరు నాని సావిత్రిబాయి పూలే మహిళా సంఘం , సావిత్రి మాత సైన్యం నాయకులు ఝాన్సీ , లక్ష్మి ,కవిత ,చందు , కృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.