SAKSHITHA NEWS

దోపిడిదార్ల పెత్తనం పోయే వరకు సంఘటితంగా పోరాడాలి – నూనె వెంకటస్వామి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

ప్రపంచం మరియు భారతదేశ సామాజిక నిర్మాణమంతా కార్మిక కష్టజీవుల రక్త మాంసాలపై నిర్మాణమై ఉందని ఏ పెట్టుబడీ, మౌళిక వనరుల వల్ల సంపద సృష్టించబడడం లేదని కేవలం కష్టజీవుల శ్రమ వల్లనే సృష్టించబడుతోందనీ, దానిపై అధికారం పేరుతో దోపిడీదార్లే హస్తగతం చేసుకున్నారనీ, కార్మికవర్గం చేతుల్లోకి అధికారం రావడం వల్లనే మేడే అమరవీరుల త్యాగాలకు నీరాజనమని” ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు. చిట్యాలలో పిఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది కార్మికులతో పిఆర్ పి ఎస్ జెండాలతో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం సెంటర్ లో బహిరంగ సభ జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం జలంధర్, ఉయ్యాల లింగస్వామి గౌడ్, రాపోలు రంగయ్య, మోటె కిష్టయ్య యాదవ్ నాయకులు మోతుకూరి లచ్చయ్య, బాతుక మల్లేశ్ యాదవ్, బొబ్బలి మల్లేశ్, రాజపాక సైదులు, షేక్ షరీఫ్, కాలిన నరసింహ, దేశపాక సైదులు, రొండి వెంకటేశ్, చింతపల్లి ప్రవీణ్, రవి, దొండ నరసింహ, అర్రూరి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS